వెంకటగిరి
వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో N. J. R భవనంలో డక్కిలి మండల నాయకులకు వెంకటగిరి రూరల్ మండలం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లిరామ్ కుమార్ రెడ్డి ఈ సమావేశం లో మాట్లాడుతూ ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేయాలని కోరారు. మీరందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో మీ అందరికీ చేసి చూపిస్తానని చెప్పారు.నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న ఏ వ్యక్తికి ద్రోహం చేయమని చెప్పారు. నేదురుమల్లి అంటే నమ్మకానికి మారుపేరని మీ అందరికి తెలుసు. జనార్దన్ రెడ్డి రాజ లక్ష్మమ్మ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంత అభివృద్ధి చేశారో మీ అందరూ తెలుసు. మీరందరూ దీన్ని గుర్తుపెట్టుకుని ఓటు వేయాలని మీరు వేయడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నవారు చేత కూడా ఓటు వేయించాలని కోరారు అనంతరం సైదాపురం మండల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ సమావేశం రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేయాలని కోరారు. మీరందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో సైదాపురం మండలం అభివృద్ధి ఎలా ఉంటుందో మీ అందరికీ చేసి చూపిస్తానని చెప్పారు.నేదురుమల్లి కుటుంబం అభివృద్ధికి అంకితమని మీ అందరికీ తెలుసు మీరు దీనిని గుర్తుపెట్టుకుని ఓటు వేయాలని చెప్పారు.