బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్:-
ప్రజలను ఎలా మోసం చేయాలని శిక్ష ఇచ్చి ప్రచా రంకు పంపుతాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గం అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కోనంగుంట, చిలమ నూరు.సంఘవరం,కోటంబేడు, బైరవరం,పెరిమిడి పంచాయితీ లలో మండల కన్వీనర్ వెందోట. కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం జరిగింద. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యం పింఛన్లు స్వయం పరిధిలో పనిచేస్తున్న వాలెంట ర్లుతో పంపిణీ చేయకూడదని ఫిర్యాదు చేసి నిలప డంతో ఎండల్లో బ్యాంకుల వద్ధ అవస్థలు పడేలా చేశాడు..ఇతనికి ఓటు వేస్తారా….అని ప్రశ్నించా రు. విద్య ,వైద్య రంగాలతో పాటు సంక్షే మానికి , అభివృద్ధికి, అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిధహదని గుర్తుచేశారు. అలాంటి సంక్షేమం కొనసాగాలంటే ప్రజల అభి వృద్ధి చెందా లంటే మరల జగన్ మోహన్ రెడ్డినీ ముఖ్య మంత్రి చేసుకుందామని కోరారు.
కరువు…బాబు కవలలు :-
చంద్రబాబు… కరువు కవలలని చమత్కార ముగా వెల్లడించారు. బాబు వస్తే రాష్ట్ర ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతారని గుర్తు చేశారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి అభి వృద్ధి చేశాడు ఒక్క సూరి మీరే గుర్తు చేసు కోవాల ని చెప్పారు. చంద్రబాబు కార్యకర్తల కాడ నుంచి ఎలా మోసం చేయాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రజ ల్లోకి పంపిస్తాడని దుయ్య పట్టారు.అమ్మ,నాని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్య లక్ష్మి లకంటే
మీ ఓటు వేసి గేలిపిస్తే వెంకటగిరి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఐదు బ్రాంచ్ కాలవ వద్ద నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా కోటంబేడు,చిమనూరు, సంగవరం,మల్లిమాల గ్రామాలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడతా మని చ�
చేపడతా మని చెప్పారు.
భూహక్కూ కలిపిస్తాం :-
వెంకటగిరి నియోజకవర్గంలో 76 వేల ఇండ్లను సందర్శించా ఎవరికి ఏమి అవసరమో ప్రతిదీ గుర్తించా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే భూమి లేని వారికి భూ హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక చుక్కల భూములు, ఇనామీ అసైన్మెంట్ మెత పరంబోకు, అడవి పరంబోకు భూములకు పట్టాలి ఇప్పించేందుకు ప్రత్యేకమైన జీవో తీసుకొస్తా. మీ బాగోగులు చూసుకునేందుకు అహర్నిశలు కష్టపడతా మాయ మాటలు చెప్పడం మా కుటుంబానికి తెలియదు ఈరోజు ఏదైతే మీకు చెబుతానో అదే నేను అధికారం కి వచ్చిన మరుక్షణం అమలు చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ వెందోటి. మధుసూధన్ రెడ్డి, ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ అధికార ప్రతినిధి రాయి దేవిక చౌదరి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి తులసి రెడ్డి, గోపాల్ యాదవ్, రామ్మూర్తి యాదవ్, వెంకటరమణారెడ్డి,
నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- మాట్లాడుతున్న నేదురుమల్లి