బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్:-
ఈ ఏడాది ఎండలు తీవ్రత అధికంగా ఉండంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కి మండల ప్రజలు అవస్థలు పడకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపీ పీ గూడూరు భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.సర్వసభ్య సమావేశం బుధవారం మండల కేంద్రంలో ఉన్న స్త్రీ శక్తి భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న చేతు బోర్లు మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్య ధోరణ వీడాలని హెచ్చరించారు. ప్రజా సమస్యల కోసం మనందరం పనిచేసి ఆ సమస్యలు పరిష్కా ర మార్గం చేపట్టేందుకు ముందుండాలని కోరారు.
ఏ ఏ గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులకు ఉన్న బోర్లు దుస్థితి, వాటి మోటర్ లేక పరిస్థితులు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశిం చారు సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యతగా పని చేయాలన్నారు.గత కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలం అడుగంటి తాగునీటికి అల్లాడుతున్న ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉండార ని ప్రజా ప్రతినిధులు తెలిపారు మన్నూరు మిట్ట, మన్నూరు గిరిజనులు భూగర్భ జలం అడుగంట డంతో తాగునీటికి అలమటిస్తున్నారని అధికారు లు మండల సర్వసభ్య సమావేశం దృష్టి తీసుకువచ్చారు. ప్రత్యామ్నాయంగా మన్నూరు మిట్ట గిరిజన వాడలో బోరు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక కొత్తూరు,గాజులపల్లి ఊట్లపల్లి, మేల్చూరు గిరిజన కాలనీ గుట్టికాడు ఎస్టి కాలనీ కడగుంట దళితవాడ సమీప వద్ద ఉన్న పాఠశాల వద్ద వేసవి తాపం వల్ల భూగర్భ జలం అడుగం టింది దీంతో తాగునీటికి ప్రజలు అలమటిస్తు న్నారని ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ, వైస్ ఎంపీపీ వాన పార్వతి, మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.