వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ ఈరోజు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు జాన్ జెండా ఎగురవేసి , మే డే శుభాకాంక్షలు కార్మికులకు తెలియజేశారు ఈ కార్యక్రమం మే డే కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 1886 వ సంవత్సరం లో 12 గంటల పని దినాలు రద్దుచేసి ,ఎనిమిది గంటల పది దినాలు కావాలని .అని చికాగో నగరంలో హే మార్కెట్లో ప్రారంభించబడిన ఉద్యమంలో అనేకమంది చనిపోయారు అమరవీరుల బలిత్యాగమే ఈరోజు ఎనిమిది గంటలు విధులు నిర్వహించడం జరుగుతున్నది ఆరోజు ,ఎనిమిది గంటలు విధులు నిర్వహించాలి ,8 గంటల నిద్రపోవాలి ,ఎనిమిది గంటలు ఇతర పనులు చేసుకోవాలి. అని నినాదంతో ప్రారంభించబడిన పోరాటం ఫలితమే నేడుమే డ దినముగా గుర్తించబడింది ఈ ఉద్యమంలో అనేకమంది ప్రాణాలు త్యాగం చేసినారు అని వారు మాట్లాడారు
కార్మిక నాయకులు కల్లూరు జాన్ మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారు కార్మికులకు గత ఐదు నెలలు వేతనాలు ఒకేసారి ఇవ్వడం చరిత్రను సృష్టించారు. అదేవిధంగా మే డే రోజు వేతనం వేయడం మరో చరిత్ర ను సృష్టించారు ఇలాంటి మంచి అధికారులు ఉన్నంతవరకు కార్మికులకు కష్టాలు తొలగిపోతాయి అందునుబట్టి ఏఐటియుసి కార్మిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు మిగిలిన కార్మిక సమస్యలను కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని వారు మాట్లాడారు
ఈ కార్యక్రమంలో నాయకులు కార్మికులు. బాలాజీ .పులి రవికుమార్. నరేష్ .అశోక్ . సుబ్బయ్య ,ముని రాజా, కందప్ప నాగేశ్వరరావు, నాగరాజా, మానస ,ఆదిలక్ష్మి గురకల రవి, నాగార్జున్,శ్రీను ,పెంచలయ్య, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.