డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో శ్రావ్య రెడ్డి కుటుంబాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు నేదురుమల్లి రాజలక్ష్మి పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రావ్య రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి కుటుంబం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన నాలుగున్నర సంవత్సరంలో మనకు జరిగిన మంచిని,మన పిల్లల భవిష్యత్తును,కళ్ళతో చూశామని ఈరోజు నిరుపేదలంతా ప్రశాంతంగా వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లకి ఏ మాత్రం తగ్గని గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత స్థాయికి చేరుకునేలా చదివించుకుంటున్నారంటే అందుకు కారకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన నాడు నేడు స్కూళ్లపై ప్రజలకు మంచి అవగాహన ఏర్పడడం వల్లనే అని రాష్ట్రంలో ఈ మార్పు జగన్మోహన్ రెడ్డి గెలుపుకు మొదటి మెట్టు అని,జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలకు మంచి తో పాటు నేటి భావితరాలకు పూలబాట వేసిందని,అదే పరిపాలనను కొనసాగించే సంకల్పంతో పేదలకు మంచి జరిగేలా నిరంతరం కృషి చేస్తున్న నేదురుమల్లి రాముకుమార్ రెడ్డి గెలుపు కొరకు మనమంతా మమేకమై వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపుకు కృషి చేసి రామ్ కుమార్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి,డక్కిలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెట్లూరు జగన్మోహన్ రెడ్డి,జెసిఎస్ కన్వీనర్ చింతల శ్రీనివాసులు రెడ్డి,మాధమల లక్ష్మీనారాయణ రెడ్డి, గురువారెడ్డి, రమేష్ రెడ్డి,మధు రెడ్డి,నాగభూషణ్ రెడ్డి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.