కలువాయి లో జరిగిన రాజకీయ సమీకరణాల పై
మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
రాష్ట్రం లో మరల సీఎం గా జగన్మోహన్ రెడ్డి ని చేసుకోవడమే లక్ష్యం గా పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పిలుపు నిచ్చారు . ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కి ఓట్లేసి గెలిపించాలని తెలిపారు.కలువాయి మండలం లోని రామన్న గారి పల్లి, నూకనపల్లి, కలువాయి, తెలుగు రాయి పురం, తోపుగుంట, రాజుపాలెం, వెంకటరెడ్డి పల్లి, కుల్లూరు గ్రామాల దళిత నాయకులతో ఆయన కుల్లూరు లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల దళిత నాయకులు రిటైర్డ్ డాక్టర్ పెంచల సుబ్బయ్య ఆధ్వర్యంలో వారు వైసీపీ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మండల దళిత నాయకులను మాదాసు గంగాధరం వైసీపీ పార్టీ కండువాలను కప్పి సాధరం గా ఆహ్వానించారు.ఈ సందర్బంగా మాదాసు మాట్లాడుతూ… మండలం లో జరిగిన రాజకీయ సమీకరణాలకు తల తనేలా ప్రతి దళిత నాయకుడు పని చేయాలని పిలుపు నిచ్చారు.ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కి ఓట్లేసి గెలిపించాలని తెలిపారు. పెతందారులకు, పేదలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.రామ్ కుమార్ రెడ్డి ద్వారా ఏ సమస్య ఉన్న చేయించే బాధ్యత నాది అని వారికీ మాదాసు హామీ ఇచ్చారు.
ఈ నెల 26 వ తేదిన ఓసీ బీసీ ల ఆత్మీయ సమావేశం.
ఈ నెల 26 వ తేది శుక్రవారం మండలం లోని ఓసీ బీసీ నాయకులతో కుల్లూరు లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. రామ్ కుమార్ రెడ్డి విజయం కోసం పల్లె పల్లె తిరిగే దానికి ప్రతి ఒక్కరు సిద్ధం గా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ అంకయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు సుబ్బారాయిడు, రామన్న గారి పల్లి, నూకనపల్లి, కలువాయి, తెలుగు రాయి పురం, తోపుగుంట, రాజుపాలెం వెంకట రెడ్డి పల్లి, కుల్లూరు గ్రామాల దళితనాయకులు పాల్గొన్నారు.
…………..