వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
కలువాయి ఎక్స్ ప్రెస్ న్యూస్.
రాష్ట్ర ముఖ్య మంత్రి గా మరల జగన్మోహన్ రెడ్డే… కావాలని ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కలువాయి మండలం లోని దాచురు, కమ్మపాలెం, దాసరపల్లి, వేరుబోట్లపల్లి, కేశమనేని పల్లి, తిరుమలపాడు, పర్లలకొండ, చీపినాపి చింతలత్మకూరు గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్బంగా అయన కు ప్రజలు హార్రాతులిచి, పువ్వులతో స్వాగతం పలికారు. బ్రాహ్మరధం పట్టారు. అంబేద్కర్ జయంతి
సందర్బంగా దాచూరు లో అంబేద్కర్ చిత్ర పటానికి పువ్వుల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా.. ఆయన మాట్లాడుతూ…సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి చేయడం హేమమైన చర్య అని అన్నారు.ఎన్నికల ప్రచారం లో పెద్దలు హుషారు, పిల్లలు జోష్ చుస్తే మరల సీఎం గా జగన్మోహన్ రెడ్డే ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో వైసీపీ పార్టీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ మాదాసు పవన్, ఎంపీపీ లక్ష్మి దేవి, జడ్పీటీసీ అనీల్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెంచల నరసా రెడ్డి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.