గెలిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకట గిరి నియోజకవర్గం అభ్యర్థి నెదురుమల్లి.రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.మండలంలోని సిద్దగుంట,తాళ్లపల్లి,పాపిరెడ్డి,ఊట్లపల్లి,నిడిగల్లు,గాజులపల్లి,కాలగంధ,కాట్రగుంట,కరిమెనగుంట,కొత్తూరు,అరిగేపల్లి,వేణుగోపాలపురం,కయ్యూరు గ్రామాలలో విస్త్రత ప్రచారం చేశారు.ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ మీరు ఆశీర్వదించిన గెలిపిస్తే అమ్మ హయాంలో ఆగిన పనులన్నీ పూర్తి చేస్తా. మాట ఇచ్చానంటే ఆ మాట నెరవేరస్తామని
హామీ ఇచ్చారు వెంకటగిరి నియోజకవర్గ కు ఏడాది క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పంపించారు. అప్పటినుంచి ప్రతి గ్రామం తిరిగా ఈ గ్రామములో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించా. మీ పవిత్రమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా.ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అమ్మ రాజ్యలక్ష్మి పై ఉన్న మీ నమ్మకం నాకు శ్రీరామరక్ష,
రైతులకు అండగా ఉంటా…! :-
ఈ ఏడాది వర్షాభావం తక్కువ వల్ల కండలేరులో నీరు మట్టం తక్కువ ఉన్న జగన్మోహన్ రెడ్డి ని అడిగి వెంకటగిరి నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే ప్రభావం ఉంది. అప్పు,చప్పులు చేసి పంటలు కాపాడుకునేందుకు రైతులు అల్లాడు తున్నారు నీరు ఇవ్వాలనే అడిగిన వెంటనే లిఫ్ట్ పద్దతిలో సాగు నీరు ఇచ్చి రైతులను ఆదుకున్న. ఇక రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిం చాలని కోరని వెంటనే మద్దతు ధర కల్పించి రైతులు సుభిక్షముల ఉండేలా చూసామని తెలిపారు.
కల్లబొల్లి మాటలు రావు :-
కల్లబొల్లి మాటలు చెప్పడం నాకు రావు నాకు తెలిసిందల్లా చెప్పిన
చెప్పిన మాటను నెరవేర్చడమే అదే నా తల్లిదండ్రులు నాకునేర్పించారు. మనసు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల్లో చెప్పిన వాటికంటే అదనంగా ఇచ్చి పేద ప్రజలు సమస్యలు తెలుసుకొని వారికి ఏమీ అవసరమో ఆ అవసరత తీర్చేందుకు గొప్ప మనసుతో ఆలోచించి అమలు చేసే వ్యక్తిత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దని కొనియాడారు. చంద్రబాబు లాగా మనసు రాని వ్యక్తి కాదని గుర్తు చేశారు.ఊట్లపల్లి గిరిజనులకు మాటిస్తున్న ఒక్క నెల తర్వాత వస్తా అటవ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొని ప్రతి గిరిజనులకు పూర్తి హక్కగా ఇంటి పత్రాలను అందజేస్తా. మీ సమస్యల కోసం పరిష్కారం చేసేందుకు నేను వస్తా మీరు చెప్పినవన్నీ నేను నెరవేరుస్తా అని పాపిరె డ్డిపల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
రూ 53 కోట్లతో అభివృద్ధి :-
నేను వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చిన ఏడాది లోపల రూ 53 కోట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి మంజూరు చేయించుకొని నియోజకవర్గంలోని అన్ని సచివాలయ పరిధిలో రూ 40 కోట్లు పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు.జగన్ మోహన్ రెడ్డి వెనుక ఉన్న జనం చూసి భయపడి చంద్రబాబుకి జనసేన బిజెపిలను పొత్తు కలుపుకొని ఎన్నికల్లో నిలబడుతున్నారని దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెందోటి. మధు సూదన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార మహిళా ప్రతినిధి రాయి దేవికా చౌదరి,పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి తులసి రెడ్డి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి, గోపాల్ యాదవ్, నీలకంఠం, కూను రామయ్య, మల్లి కార్జున్, శేషారెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీరాములు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.