వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
నామకృత ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని వైఎస్ఆర్సిపి తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బీసీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ లు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత మల్లమ్మ గుడి వీధిలోని మల్లమ్మ తల్లి తాతయ్య శెట్టి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాన్ని పేదలకు వడ్డించి ప్రారంభించారు. వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి దర్శించుకుని ప్రత్యేక
చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు