డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో వైకాపా తన సత్తా చాటుతుందని ఎవరు లెక్కల వారికి ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు డక్కిలి మండల వైకాపా నాయకులు. ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారాన్ని చాలా గ్రామాల్లో గడపగడపకు తీసుకువెళ్లినట్లు ప్రతిచోట పేదలు సామాన్యులు తిరిగి వైకాపా గెలవాలని జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నా ఆలోచన చేస్తున్నట్లు మండల ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారు. ఆదివారం డి వడ్డిపల్లి గ్రామపంచాయతీలో ప్రతి గడపగడపకు వెళ్లి వైకాపా ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలకు పథకాలు నేరుగా అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అదేవిధంగా వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిని, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వెలికంటి చెంచయ్య, ఎంపిటిసి సామాది చెంచయ్య, మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్ నారాయణరెడ్డి, సంగనపల్లి సర్పంచ్ చిరంజీవి, మామిడి శ్రీనివాసులు, శ్రీహరి రెడ్డి, నాగభూషణం రెడ్డి, బండి రమేష్ రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.