డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : వెంకటగిరి నియోజకవర్గ వైకాపా సోషల్ మీడియా కోకన్వీనర్ పచ్చురు. రమేష్ గౌడ్ తన బాబు జితిన్ పుట్టినరోజు వేడుకను డక్కిలిలో తన నివాసంలో జరుపుకున్నారు, ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి బాబు జితిన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు . ఒక సామాన్యమైన వైకాపా సోషల్ మీడియా కోకన్వీనర్ అయినా తన ఇంటికి రాజ్యలక్ష్మిమ్మ రావడం నాకు మా కుటుంబ సభ్యులకు చాలా ఆనందంగా ఉందన్నారు. తన అనుకున్న వారికి నేదురుమల్లి కుటుంబం ఇచ్చే గౌరవం అలాంటిదిని వాళ్లు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట శ్రీహరికోట కృష్ణయ్య, జే సి ఎస్ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు రెడ్డి, కోళ్లపూడి వేణుగోపాల్, ఎమ్మెల్ నారాయణరెడ్డి, మామిడి శ్రీనివాసులు, బండి వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.