వెంకటగిరి రూరల్ మండలంలో మాజీమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ పర్యటన
(వెంకటగిరి రూరల్` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
రాష్ట్ర మాజీమంత్రినేదురుమల్లి రాజ్యలక్ష్మి సోమవారం నాడు వెంకటగిరి రూరల్ మండలంలోని పల్లకారు, చిన్నన్నపేట గ్రామాల్లో ఆత్మీయులను పలకరించడానికి పర్యటించింది. ప్రతి గ్రామంలోని గత కాలం నాటి అభివృద్ధి జ్ఞాపకాలను, ఆనాటి పరిస్థితులను ప్రజలతో పంచుకుంటూ ఆత్మీయంగా సాగింది. ఈసందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతూ వైసిపి ప్రజల కోసం మంచి చేస్తోందని, తప్పకుండా ఆ పార్టీకి అండగా నిలవాలని కోరింది. తన కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైసిపి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున మీరంతా ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరింది. ఆ మాట వినగానే జనం ఎంతో సంతోషంతో తప్పకుండా ఓటేస్తామన్నారు.