వెంకటగిరిలో అట్టహాసంగా ఎన్నికల ప్రచారం
ప్రారంభించిన లక్ష్మీసాయి ప్రియ
Iభారీగా జనసమీకరణ
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్ప్రెస్) వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మీసాయి ప్రియ సోమవారం నాడు ఎంతో అట్టహాసంగా పట్టణంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమె వెంట తల్లి శ్రీమతి సింధు, తండ్రి కురుగొండ్ల రామక్రిష్ణ, కుమార్తె యామి వెంట రాగా ఆ పార్టీ నాయకులతో కలిసి తనకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించింది. ఆదివారం ఉదయం ముందుగా కాశీ విశ్వనాధుని దేవాలయం, పోలేరమ్మ గుడిలో పూజలు చేసిన అనంతరం పట్టణంలో ప్రచారాన్ని ప్రారంభించారు. వైసిపి పాలనలో అభివృద్ధి బాగా కుంటుపడిరదని, తన తండ్రిలాగానే తాను కూడా ప్రజలకు అండగా వుండి సేవలు చేస్తానని లక్ష్మీసాయి ప్రియ విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహయాదవ్, గూడూరు మాజీ ఎమ్మెల్యే సునిల్ కుమార్, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, రాష్ట్ర కార్యదర్వి గంగోడు నాగేశ్వరరావు, మహిళా నాయకురాళ్ళు ఉష తదితరులు పాల్గొన్నారు.