సైదాపురం, వెంకటగిరి ఎక్స్ ప్రెస్ 23:
సైదాపురం మండలం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ ల్లో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న ఐదు లక్షల రూపాయల నగదు ను పోలీస్ లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి పత్రాలు లేకపోవడం తో ఐదు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టడం జరుగుతుందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.