తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మీసాయిప్రియ
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్ప్రెస్)
తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీ`పస్టీలందరికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి చంద్రబాబునాయుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచారని వెంకటగిరి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీసాయిప్రియ తెలిపారు. గురువారంనాడు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పస్సీపస్టీలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి సూళ్ళూరుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే పరసారత్నంను ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకు సరైన న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పరసా వెంకటరత్నం మాట్లాడుతూ జగన్ పాలనలో దళితులకు న్యాయం జరగలేదని, పథకాలు సరిగా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి లక్ష్మీసాయి ప్రియను గెలిపించాలన్నారు.