క్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :జగనన్న పాలనలో అన్ని వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను, సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి నేరుగా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు ఎంపీపీ గోను రాజశేఖర్. గురువారం మధ్యాహ్నం వైయస్సార్ చేయూత 4.74 కోట్ల నాలుగో విడత చెక్కును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో తాహిసిల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీవో లీలా మాధవి పాల్గొన్నారు. వైకాపా జెసిఎస్ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అన్నగా తోబుట్టుగా జగనన్న కానుక వైయస్సార్ చేయూత పథకం అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయనటువంటి పథకాలను జగనన్న అమలు చేశారని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించినటువంటి జననేత జగనన్న అని కొనియాడారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మహిళలు అండగా ఉండాలని తిరిగి జగనన్న ముఖ్యమంత్రి అవుతానే జగనన్న అమలు చేసిన పథకాలు కొనసాగిస్తారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి,ఎమ్మెల్ నారాయణరెడ్డి,కోళ్లపూడి వేణుగోపాల్, రాపూరు చిరంజీవి, నావురు. కోటేశ్వరరావు, మామిడి శ్రీనివాసులు, గోవర్ధన్ నాయుడు,పొదుపు మహిళలు, పొదుపు ఏరియా కోఆర్డినేటర్ ఆదినారాయణ, సీసీలు, సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.