డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :సార్వత్రిక ఎన్నికల సమరానికి మరొకని గంటలలో కోడ్ అమలులోకి వస్తుందన్న ముందస్తు సమాచారం ఉన్నందువలన మరియు పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలపై బిఎల్వోలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు డక్కిలి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీవో లీల మాధవి. ఈ సందర్భంగా తాహిసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఏ క్షణమైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అందువలన గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉన్న పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడగాలని ఆయన వారికి ఆదేశించారు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు, ఫర్నిచర్స్,ర్యాంపు, త్రాగునీరు సౌకర్యం, టెంట్లు ఏర్పాట్లు ఉండే విధంగా చూడాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగస్తులు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రజా ప్రాతినిధి చట్టం, ఐపిసి, సిఆర్పిసి సెక్షన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు, ఎవరైనా ఎన్నికల కోడ్ ను అతిక్రమించితే చర్యలకు వెనుకాడనన్నారు. ఎన్నికల నియమావళి ఎలక్షన్ కౌంటింగ్ వరకు అమలులో ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కే వెంకటేశ్వర్లు. బి ఎల్ వోలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.