డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : నేడు జాతీయ పల్స్ పోలియో దినోత్సవ సందర్భంగా మండలంలోని అప్పుడే పుట్టిన ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయాలని డక్కిలి తాహిసిల్దార్ జి శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలో మొత్తం ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 4477 మంది ఉన్నారని. వారందరికీ అన్ని సచివాలయ పరిధిలో వైద్య సిబ్బంది , ఆశ వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు సహకారంతో పోలియో చుక్కలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలియో వ్యాధి నుండి తమ బిడ్డలను రక్షించుకునే బాధ్యత మన అందరదిని తాహిసిల్దార్ అన్నారు.