బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
కడిమి సుబ్బమ్మ భూమికి సంబంధించి పట్టాదార పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని 30 ఏళ్ళు గా రెవిన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని
గురువారం బాలాయపల్లి తహశీల్దార్ కార్యాల యం వద్ద మార్పుసంస్థ వ్యవస్థాపకులు చిగురు పాటి పవన్ ప్లకార్డ్ తో మోకాళ్ళ మీద కూర్చుని నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ మండలం బైరవరం గ్రామానికి చెందిన కడిమి సుబ్బమ్మ 35 సంవత్సరాల క్రితం కోవురు వారిగుంట సర్వే నంబర్ 9 లో మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటూ , పట్టా పాస్ బుక్ ల కొరకు 30 సంవత్సరాలుగా తహశీ ల్దార్ కార్యాలయం,గూడూరు ఆర్ డీఈ కార్యాల యం,నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం, తిరుప తి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అనేక అర్జీలు ఇస్తున్నా ఏ అధికారి పట్టించుకోక పోవడం దారుణమన్నారు.వృద్ధురాలు, దళిత మహిళ , 5 గురు ఆడబిడ్డలు కలిగిన నిరుపేద కుటుంబం అని కూడా కనికరం లేకుండా రెవిన్యూ అధికారులు తిప్పుకొంటున్నారు.ఇకనైన అధికారు లు స్పందించి పట్టా, పాస్ బుక్ ఇవ్వని పక్షంలో బహుజన సంఘాలను కలుపుకొని ఆమరణ దీక్షకు దిగుతామని పవన్ హెచ్చరించారు.
పోటో:-తహసీల్దారు కార్యాలయం వద్ద మోకాళ్లుపై నిరసన
పోటో:-కోనుగోలు చేసిన డాక్యుమెంట్స్