డక్కిలి :వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :సోమవారం గూడూరు ఆర్డీవో కార్యాలయం నందు స్పందన కార్యక్రమంనకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ షా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ లోని అన్ని శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా హాజరౌతున్నారు. కావున డక్కిలి మండలం లోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డక్కిలి తాహిసిల్దార్ జి శ్రీనివాస్ యాదవ్ ఎంపీడీవో లీలా మాధవి లు సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.