కలువాయి యు.టి.ఎఫ్ తీర్మానం.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
ఓట్ ఫర్ ఓ పి ఎస్ అనే నినాదంతో పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ అజెండా కావాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయ టీచర్స్ ఫె డ రే ష న్ (యు.టి.ఎఫ్ ) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కలువాయి మండలంలోని UTF నేతలు ఓట్ ఫర్ ఓ.పి.ఎస్ అనే పోస్టర్లను ఆవిష్కరించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోస్టర్లను అంటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని గత ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించారని అన్నారు. ప్రస్తుతం సిపిఎస్ బదులుగా తీసుకువచ్చిన జిపిఎస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో ఓపిఎస్ సాధనే అజెండా చేయాలని అన్ని రాజకీయ పక్షాల నాయకులను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కలుస్తామని చెప్పారు.ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కలుపుకొని ఓపిఎస్ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో యు.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి రవిబాబు, కలువాయి మండల యు టి ఎఫ్ అధ్యక్షులు చల్లా మల్లికార్జునరెడ్డి,ప్రధాన కార్యదర్శి బొలిగర్ల మస్తాన్ బాబు , FWF జిల్లా కార్యదర్శి K సుధాకర్,V .కృష్ణయ్య,G రాధాకృష్ణ ,U లక్ష్మీ నారాయణ K.పెంచలయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు వజ్రాల శ్రీనివాసులు పాల్గొన్నారు.