వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్ (రాపూరు):- పట్టణంలోని వినాయక స్వామి గుడి వద్ద మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు గంగోడి ఆనంద్, టీడీపీ నాయకులు తుమ్మలపల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. వెంకటగిరి నియోజవర్గంలో బీసీ జనాభా అధిక సంఖ్యలో ఉండడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయిస్తే పార్టీ సునాయాసంగా గెలుస్తుందని,అనేక ఏళ్లుగా వెంకటగిరి నియోజకవర్గ స్థానం జనరల్ అభ్యర్థికే కేటాయించారని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు జ్యోకం చేసుకొని పార్టీ టికెట్ ఇకనైనా బీసీలకు ఇస్తే పార్టీ విజయం నల్లేరు మీద నడకగా మారుతొడన్నారు.ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా,చంద్రరెడ్డి,ముళ్లపాటి చిన్న సుబ్బయ్య,సుబ్రహ్మణ్యం,నాగయ్య,బాద్షా,కోటి,టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.