కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా ఫిబ్రవరి 2వ తేది న ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కలువాయి వస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు సందర్బంగా మనస్థాపం తో మృతి చెందిన బోలిగర్ల చెన్నయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారని తెలిపారు.నిజం గెలవాలి కార్యక్రమాని విజయ చేసేందుకు కురుగొండ్ల ఏర్పాట్లను పరిశీలించేందుకు కలువాయి వచ్చారు.ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ….నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా ఫిబ్రవరి 2వ తేది న 12 గంటలకు కలువాయి లో 3 గంటలకు రాపూరు మండలం మరో కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుతారని తెలిపారు, ఈ కార్యక్రమానికి కలువాయి మండలంలోని టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు.కురుగొండ్ల వెంట టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, ప్రధాన కార్యదర్శి జగదల్ నాయుడు, మల్లికార్జున యాదవ్, నరసింహ లు యాదవ్ సోమయ్య యాదవ్, కిషోర్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.