మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన రైతులు.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
కలువాయి మండలం కేశమనేని పల్లి గ్రామం లో గీన్ కంట్రీ కంపెనీ వద్ద భూములు కొనుగోలు చేసిన వ్యక్తుల వద్ద తాము భూములు కొనుగోలు చేసామని రైతులు గోవర్ధన రెడ్డి, నవీన్, విజయ కుమార్ రెడ్డి, శంకరయ్య పేర్కొన్నారు.తాము బోగస్ భూమి కొనుగోలు సర్టిఫికెట్ లు సృష్టించామని రుజువు చేస్తే భూములను వదలేసిపోతామని చెప్పారు. బుధవారం కేశమనేని పల్లి లో భూములు పరిశీలనకు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వచ్చారు. ఈ సందర్బంగా భూములు పై ఆయన చేసిన ఆరోపణలను గురువారం భూములు కొనుగోలు చేసిన రైతులు ఖండించారు. కేశమనేని పల్లి లో రైతులు భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్ పత్రాలను చూపుతూ మీడియా సమావేశం రైతులు ఎర్పాటు చేసి వివరించారు.గీన్ కంట్రీ కంపెనీ వద్ద భూములు కొనుగోలు చేసిన వ్యక్తుల వద్ద తాము భూములు కొనుగోలు చేసామని తెలిపారు.ఒక సెంటు ప్రభుత్వ భూమి ఉన్న సీజే ఎఫ్ ఎస్ భూములు తాము కొనుగోలు చేసి ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎం చెప్పిన మేము అంగీకరిస్తామని పేర్కొన్నారు. దొంగలను వెనకేసుకొని మాట్లాడడం సబబు కాదని వారు హితవు పలికారు. తహసీల్దార్, సబ్ రిజిస్టార్ లను తీసుక వచ్చి తాము కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తామంటే ఎక్కడికి రమంటే అక్కడ కు వస్తామని రైతు లు తెలియజేసారు.