రాపూరు (వెంకటగిరి ఎక్సప్రెస్):-పెంచలకోన క్షేత్రం నందు శనివారం సందర్భంగా ఉదయం అభిషేకం గావించిన అనంతరం స్వామి వారికీ కళ్యాణోత్సవం జరిగింది.సాయంత్రం చెంచులక్షీ,ఆదిలక్ష్మి సమేత నరసింహ స్వామి వారి కి తిరుచ్ఛి పల్లకి సేవ ప్రధానార్చకులు,వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్య,గిరిజనుల వాయిద్య నడుమ సహస్రధీపాలంకరణ సేవ(ఊంజల్ సేవ) వైభవంగా నిర్వహించడమైనది.భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్ల ఏర్పాట్లు,మంచి నీరు సరఫరా,అన్నదానం మొదలగు కార్యక్రమాలు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినది మరియు స్వామివారి నిత్య అన్నదాన పథకములకు మహారాజు పోషకులుగా బెంగళూరు వాస్తవ్యులు కీ||శే నరసాపురం చెంగామ్మ,తిరుపాలయ్య గార్ల జ్ఞాపకార్థం కుమారుడు శ్రీ హరిప్రసాద్,సింధు గార్లు నిత్య అన్నదాన పథకమునకు రూ1,51,111/-( అక్షరములు ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నూటపద కొండు రూపాయలు) ఆన్లైన్ ద్వారా ఏపీజీబీ బ్యాంకు నందు జమ చేయడం జరిగినదని కోవూరు జనార్దన్ రెడ్డి
సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి తెలియజేసినారు.