బాలాయపల్లి -( వెంకటగిరి ఎక్స్ ప్రెస్) :-
సంక్రాంతి సంబరాలు వైభవంగా ముగిశాయి. మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా గొబ్బెమ్మ నిమజ్జన కార్యక్రమాలుమహిళలలు నిర్వహించారు.బాలాయపల్లిలో మహిళలు గురువారం గౌరవ దేనికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలందరూ స్థానిక రామాలయం వద్దకు చేరి, గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గొబ్బెమ్మ, ఆటపాటలతో అలరించి, అనంతరం ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా ఆచారంగా వస్తున్న గొబ్బెమ్మ పండుగతో పాడిపంటలు అభివృద్ధి చెంది, ప్రజలంతా సుఖసంతోషాలతో మెలుగు తారని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు గొబ్బెమ్మ ఆటపాటలతో, కోలాట నృత్యాలతో ఘనంగా గొబ్బెమ్మ నిమజ్జనం చేశారు.
ఫోటో:- గొబ్బి తట్టుతున్న మహిళలు
ఫోటో :-నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న గౌరీదేవి