బాలాయపల్లి (వెంకటగిరి ఎక్స్ ప్రెస్ ):-
‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపు రుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారుని ఆరోజూల్లో ఎన్టీఆర్. అన్న మాట నిలువెత్తు నిదర్శనమని టీడీపీ మండల కన్వీనర్ రాయి. మస్తాన్ నాయుడు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో వర్ధంతి జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్.
తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చిందిన్నారని గర్తుచేశారు.ఇక నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టిందిని గుర్తు చేశారు. అనంతరం దాసరి ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు.
చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి.. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టి కరిపించారని గుర్తు చేశారు.ఆయన ప్రతి మాట ఓ తూటాగా.. ఆయన సందేశమే స్పూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లిందిన్నారు. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడ్డ నటుడు రాజకీయ నేతగానూ అభిమానించబడ్డారని గుర్తుచేశారు. కృష్ణుడు అంటే ఎలా ఉంటారో.. రాముడు అంటే ఎలా ఉంటారు తెలియని వారికి ఇదిగో వారి రూపం అంటూ నటుడిగా సాక్ష్యాత్కరించిన నటసార్వ భౌముడు ఎన్టీఆర్.. నాయకుడంటే ఇలా ఉంటాడు అని పాలించి చూపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ దాసరి రాజగోపాల్ నాయుడు, చెరుకూరు రామచంద్ర నాయుడు, సత్యం నాయుడు, సివికేఎన్ నరసింహులు నాయుడు, పార్లపల్లి శ్రీనివాసు రెడ్డి,
పార్లపల్లి రఘురామరెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- నివాళులర్పిస్తున్న దృశ్యం