బాలాయపల్లి :-
15 లక్షల 20 వేలుతో 15 మంది లబ్ధిదారులకు వైయస్సార్ జలకల ద్వారా పంపుసెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం క్లస్టర్ ఏపీ డి జి వరప్రసాద్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడు భూములు సాగు బొమ్మలు గా మారెందుకు వైయస్సార్ జలకల ఎంతో ఉపయోగకరమన్నారు.2ఎకరాల 50 సెంట్లు భుమి ఉన్న ప్రతి రైతుకు జలకళ పథకం వర్తిస్తుందన్నారు తాసిల్దార్ కార్యాలయం నుంచి చిన్న సన్న కారు రైతు అనుమతి పత్రం ఉంటే ఈ పథకం కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే వస్తుం దని తెలియజేశారు. అనంతరం మండలములోని 15 మంది రైతులకు మొదటి విడత కంప చెట్లు మంజూరు అయ్యాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో మృత్యుంజయరావు, మాస్టర్ వెరిఫికేషన్ డిఆర్పి రాఘవేంద్ర, ఉపాధి హామీ పథకం సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఫోటో:- జలకల పంపు సెట్టు పంపిణీ చేస్తున్న దృశ్యం