బాలాయపల్లి :-
వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు వచ్చిన జనాభాను చూసి టిడిపి భయపడ్డారని వైయస్సార్సీపి రాష్ట్ర అధికార మహిళా ప్రతినిధి రావి దేవిక చౌదరి పేర్కొన్నారు. ఆదివారం బాలాయపల్లి మండల కేంద్రంలో ఉన్న దేవిక చౌదరి బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నారని గుర్తు చేశారు. మన నియో జకవర్గ ముద్దుబిడ్డ గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీ యం నేర్పించినా దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి ని వెంకటగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు శక్తివంతుడు లేకుండా పని చేయాలని కోరారు. నేడు వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే జనార్దన్ రెడ్డి పుణ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సైనికులాగా పనిచేసే రాంకుమార్ రెడ్డి ని గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలని. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వెంకటగిరి నియో జకవర్గ పరిధిలోని చేనేత సభకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో దిగ్విజయంగా జరిగిందని. ప్రజలు అండదండలు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయని తెలిపారు. సామాజిక సాధికార బస్సుయాత్ర వెంకటగిరి నుండి డక్కిలి మీదుగా రాపూరు లో బహిరంగ సభ కు భారీగా ప్రజలు బ్రహ్మరథం పట్టి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారని, ఈ
యాత్ర విజయవంతంగా పూర్తి కావడంతో టీడీపీ నాయకులు చూడలేక పలు పుకార్లుగా, విమర్శిస్తున్నారని రాబోయే రోజుల్లో నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ప ర్యటన ఉందని భారీ ఏర్పాట్లను చేశారని అదేవిధంగా అదేవిధంగా ఈనెల తొమ్మిదో తారీఖున తలపెట్టిన రా కదలి రా కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి కారణం సామాజిక సాధికార బస్సుయాత్రేనని వచ్చిన జనసంత్రాన్ని చూసి ఒక్కసారిగా తెదేపా నేతలు ఉలిక్కిపడ్డారని అన్నారు. రానున్న 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా గెలిపించుకొని అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకుంటారని అన్నారు.
ఫోటో :-మాట్లాడుతున్న దేవిక చౌదరి