వెంకటగిరి: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు గత 13 రోజులుగా చేస్తున్న సమ్మె పట్టణంలో ఎక్కడ చూసినా దుర్గంధాన్ని వెదజల్లుతున్నది. వెంకటగిరి పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త పేరు ప్రజలు వీధులు తిరగాలంటే ముక్కు మూసుకోవాల్సిందేనని వాపోతున్నారు. కార్మికుల జీతాలు పెంచాలంటూ చేస్తున్న సమ్మె రోజురోజుకు ఉదృతంగా మారుతుంది, దీంతో మున్సిపల్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పట్టణంలో పేరుకుపోయిన చెత్తను ఎత్తించలేక అవస్థలు పడుతున్నారు.వార్డుల్లో ప్రజలుఇంకాఎంతకాలంఈ ఆవస్తులంటూ కౌన్సిలర్లను నిలదీస్తున్నారు. ప్రజా సమస్యల దృష్ట్యా ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై స్పందించి విధులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.