ప్రజాశక్తి వెంకటగిరిరూరల్ : తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవ సంస్థ ఏపీపి ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం కోర్టు ఆవరణంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గులు పోటీలకు ముఖ్య అతిథులుగా టిడిపి, నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్, బిజెపి నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు, విద్యావేత్త వంకి పెంచలయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీపీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ దృష్టితో పారిశుద్ధ్య కార్మికుల మహిళలతో ఈ ముగ్గులు పోటిలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం వెంకటగిరిలో ముగ్గులు పోటీలను నిర్వహించడం ఆనవాయితీ అని కానీ ఈ సంవత్సరం మా సేవా సంస్థ ద్వారా అణగారిన వర్గాల మహిళల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసేమన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన మొదట రెండవ మూడవ బహుమతులు, మరియు గెలుపొందని వారికి కూడా ఇవ్వడం జరిగింది.