శిబిరం లో మానవహారం చేపట్టి నిరసన
వెంకటగిరి : మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. శిబిరంలోనే మానవహారం చేపట్టి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ గత 13 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో మీరు పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నారని అన్నారు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. మన ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. పోటీ కార్మికుల్ని పెట్టి సమ్మె విచ్చనం చేయకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని పర్మినెంట్ చేయాలని అన్నారు. లేదంటే సమ్మె వదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు వెంకటగిరి పట్టణ కార్యదర్శి ఎస్ ప్రసాద్ మున్సిపల్ కార్మికులు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.