వెంకటగిరి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంకటగిరి పర్యటన వాయిదా పడినట్లు విశ్వాసనీయ సమాచారం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు తెదేపా నాయకులు చంద్రబాబు నాయుడు ఈనెల తొమ్మిదో తేదీ న వస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో 9వ తేదీ రావాల్సిన బాబు రావడం లేదని తెలియజేశారు. గత వారం రోజులుగా బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించడం మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం అంతా హడావుడిగా జరిగిన తీరా రెండు రోజుల ముందు వాయిదా పడడంతో తెదేపా నాయకుల్లో నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలోనూ పర్యటన తేదీని ఖరార్ చేసిన తర్వాత వాయిదా పడింది. కానీ ఈ నెల 9వ తేదీన పర్యటనకు మార్పు లేదనుకుంటున్న సమయంలో అదే తారీఖున కేంద్ర ఎన్నికల కమిషన్ తో సమావేశం ఉందని అందువలన రాలేకపోతున్నారనే విశ్వాసనీయ సమాచారం. తర్వాత మరల బహిరంగ సభకు వస్తారా రారా అనే సందిగ్ధంలో ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.