ఖతార్ లో ఆదివారం అర్జెంటీనాతో జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్
జట్టును జలుబు వైరస్ కలవరపెడుతోంది. ఇది జట్టులోని కనీసం ముగ్గురు ఆటగాళ్లను
ప్రభావితం చేసింది. జట్టులోని డిఫెండర్ దయోట్ ఉపమెకానో, మిడ్‌ఫీల్డర్
అడ్రియన్ రాబియోట్ కు వైరస్ లక్షణాలు ఉన్నట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య
శుక్రవారం తెలిపింది. అందుకే వారు మొరాకోతో జరిగిన మ్యాచ్ లో ఆడలేదని కోచ్
డిడియర్ డెస్చాంప్స్ చెప్పారు . ఆయన మాట్లాడుతూ… ” ఫ్రాన్స్ శిబిరాన్ని
ప్రభావితం చేసే నిర్దిష్ట వైరస్ ఇంకా అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఖతార్‌కు వచ్చిన
చాలా మంది సందర్శకులు మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌తో పోరాడుతున్నారు.
ఇది ఫ్లూ లాంటి అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. ఈ కారణంగానే జట్టులో
కొందరికి జలుబు లక్షణాలు ఉన్నాయి” అని వెల్లడించాడు. వైరస్ సోకిన వారిని
ప్రత్యేక గదిలో ఉంచినట్లు చెప్పాడు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెందిన
మేనేజ్మెంట్, ఫిఫా నిర్వాహకులు సమావేశమయ్యారు.