బౌలర్లు బంతిని ఏ దిశగా సంధించినా బౌండరీ తరలించగల ప్రతిభ సూర్యకుమార్ యాదవ్
సొంతం. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లోనూ
సూర్య ఈ తరహా బ్యాటింగే చేశాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో
ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు భారత్ భారీ స్కోర్ నిర్దేశించింది. దీనిని
చేధించలేక ఆతిథ్య దేశం చతికిలపడడం.. భారత్ విజయం సాధించడం తెలిసినవే. కాగా
అద్భుత బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్
ప్రశంసిస్తూ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా
ఆసక్తికరంగా స్పందించాడు. ‘‘ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్.. ప్రపంచంలో అతనెందుకు
ఉత్తమమో చూపిస్తున్నాడు. నాకైతే లైవ్ చూసినట్టు లేదు. అతడాడిన మరో వీడియో
గేమ్ ఇది’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంగా
స్పందిస్తున్నారు. ట్విటర్లో కేవలం 40 నిమిషాల్లోపే 60 వేలకుపైగా లైక్స్
కొట్టారు.