ఈ ఏడాది ఖతార్ లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ యువ క్రీడాకారులకు గొప్ప వేదిక కానుంది. ప్రపంచ కప్‌లో లెజెండరీ క్రీడాకారులు ఇప్పటికే రిటైర్మెంట్ కు దగ్గరయ్యారు. ఈ క్రమంలో యంగ్ ప్లేయర్స్ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుమేందుకు ఈ ఫిఫా ప్రపంచకప్ ఓ మంచి వేదిక కాబోతోంది. కేవలం గతాన్ని ఓసారి పరిశీలిస్తే .. 1998లో 18 సంవత్సరాల వయస్సు గల మైఖేల్ ఓవెన్ అనే అర్జెంటీనా ఆటగాడు ఓ కీలక గోల్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక బార్సిలోనా మిడ్‌ఫీల్డర్ రెండేళ్లుగా మిడ్‌ఫీల్డ్‌ను నడిపే బాధ్యతలను మోస్తున్నాడు. అతను యూరో 2020లో కూడా ఆకట్టుకున్నాడు. బలమైన ప్రపంచ కప్ ప్రదర్శనతో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా తన అధికారాన్ని మరింతగా ముద్రించే అవకాశం ఉంది. ఇలాంటి సాకర్ క్రీడాకారులు తమ అవకాశాన్ని నిరూపించుకునేందుకు ఖతార్ లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ వేదిక కాబోతోంది.