మిస్ యూ ధోని అంటూ హ్యాస్ ట్యాగ్
“రోహిత్ శర్మ పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఫిట్ నెస్ పై కూడా చాలా
అనుమానాలున్నాయి…” అంటూ ప్రస్తుతం రోహిత్ కెప్టెన్సీపై విపరీతమైన ఆరోపణలు
వస్తున్నాయి. ఒక దశలో సీనియర్ మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ నిర్ణయాలపై
ఫైరవుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా సెమీస్ దశ నుంచే ఇంటి దారి
పట్టింది. ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో పేలవ ప్రదర్శన చేసిన భారత్ అవమానకర
రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రోహిత్
కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా సెమీఫైనల్లో ఏకంగా పది
వికెట్ల తేడాతో చిత్తయింది. ఇలా చిత్తుగా ఓడిపోవడం సగటు క్రికెట్ అభిమాని కూడా
జీర్ణించుకోలేకపోయాడు. ఇక టోర్నీలో భారత్ తరఫున కేవలం సూర్యకుమార్ యాదవ్,
విరాట్ కోహ్లీ లు మాత్రమే నిలకడైన ప్రదర్శన కనబరిచారు. అయితే టీమిండియా
అభిమానులు. కెప్టెన్ రోహిత్ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్లో
ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో రోహిత్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
రోహిత్ శర్మ ఐపీఎల్లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.
ఇక అదే సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తలచుకుంటున్నారు. ‘మిస్ యూ మహి’
అంటూ పోస్టులు పెడుతున్నారు. అందరి కంటే ‘మిస్టర్ కూల్’ బెటరంటూ
ప్రశంసిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కెప్టెన్సీ హాష్‌ట్యాగ్
ట్రెండింగ్‌లోకి వచ్చింది.