వరల్డ్ కప్ టూర్ లో ఉన్న శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణ తిలక వరస్ట్ పని చేసి చిక్కుల్లో పడ్డాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అతడిని అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసారు. 29 ఏళ్ళ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుణతిలకను సిడ్నీ సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ డేటింగ్ యాప్ ద్వారా తనను వేధించినట్టు మహిళ గుణతిలకపై ఫిర్యాదు చేసింది. గుణతిలకను అదుపులోకి తీసుకున్న విషయాన్ని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తమ వెబ్ సైట్లో తెలిపారు. అయితే శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు తప్ప గుణతిలక పేరును వెల్లడించలేదు.