టీ20 ప్రపంచం కప్‌లో నెదర్లాండ్స్ – సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించడంతో భారత్ సెమీస్ మార్గం సుగమమైంది. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలలో మొదటి స్థానానికి చేరుకుంది. మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకిచ్చింది. ఏకంగా 13 పరుగుల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు వెళ్లే మార్గం మూసుకుపోయింది.