టైటాన్స్ పై అద్భుత విజయం సాధించింది. తాము సాధించింది 130 పరుగులే అయినా,
దాన్ని కాపాడుకున్న తీరు అమోఘం. 131 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20
ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులే చేసి ఓటమిపాలైంది.కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పటికీ ఆ జట్టుకు గెలుపు సాధ్యం
కాలేదు. పాండ్యా 59 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. ఆఖర్లో కొంత హైడ్రామా
నెలకొంది. గుజరాత్ టైటాన్స్ 12 బంతుల్లో 33 పరుగుల చేయాల్సి ఉండగా… నోర్కియా
బౌలింగ్ లో తెవాటియా వరుసగా మూడు భారీ సిక్సులు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని
మార్చివేశాడు.
చివరి ఓవర్ లో ఆ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా… ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్
తో టైటాన్స్ కు అడ్డుకట్ట వేశాడు. తెవాటియాను అవుట్ చేయడమే కాకుండా, కేవలం 6
పరుగులే ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కు స్ఫూర్తిదాయక విజయాన్ని అందించాడు.
అసలు, ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభం కూడా ఢిల్లీ జట్టు తరహాలోనే
ఒడిదుడుకుల మధ్య సాగింది. ఓ దశలో గుజరాత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి
కష్టాల్లో పడింది. అయితే పాండ్యా, అభినవ్ మనోహర్ (26) ఇన్నింగ్స్ ను
చక్కదిద్దారు.
మనోహర్ అవుటైన తర్వాత వచ్చిన తెవాటియా 7 బంతుల్లోనే 20 పరుగులు చేసి టైటాన్స్
కు విజయంపై ఆశలు కల్పించాడు. కానీ ఇషాంత్ శర్మ విసిరిన చివరి ఓవర్ గుజరాత్ కు
నిరాశనే మిగిల్చింది.