టైటాన్స్ , చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ
ఐపీఎల్ 16వ సీజన్లో కన్పించనున్న 3 కీలక మార్పులు మ్యాచ్‌పై ప్రభావం
చూపించబోతున్నాయి.వాస్తవానికి ఇదేమీ కొత్త కాదు. దీనినే హోమ్ అండే ఎవే ఫార్మట్ అంటారు. మొత్తం
పది జట్లు 7 గేమ్స్‌ను తమ హోమ్ గ్రౌండ్లో ఆడాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెన్నై
సూపర్‌కింగ్స్ జట్టు చిదంబరం స్టేడియంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
చిన్నస్వామి స్టేడియంలో ఆడనున్నాయి.
టాస్ గెలిచిన తరువాత ప్లేయింగ్ 11 సమర్పించేటప్పుడు 5 మంది సబ్‌స్టిట్యూట్
ప్లేయర్లకు ప్రతి జట్టుకు అనుమతి ఉంటుంది. ఈ ఐదుమందిలో ఒకరు ఇంపాక్ట్
ప్లేయర్‌గా బరిలో దిగేందుకు అవకాశముంటుంది. అయితే తప్పనిసరి నిబంధన కాదు.
ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్‌తో బదిలీ అయిన తరువాత జట్టులోకి సబ్‌స్టిట్యూట్
ఫీల్డర్‌గా కూడా తిరిగి రాలేడు. మరోవైపు ప్లేయింగ్ 11లో విదేశీ ఆటగాళ్లు
నలుగురి కంటే తక్కువే ఉంటే తప్ప ఇంపాక్ట్ ప్లేయర్ భారతీయుడు కాలేడనే నిబంధన
ఉంది.
ఐపీఎల్లో బీసీసీఐ మరో కీలక నిబంధన తీసుకొచ్చింది. టాస్ తరువాత రెండు జట్లు
ప్లేయింగ్ 11 ప్రకటించవచ్చు. టాస్ ఆధారంగా బెస్ట్ జట్టుని ఆడించేందుకు ఈ కొత్త
నిబంధన వీలు కల్పిస్తుంది. దక్షిణాఫ్రికా 20 లీగ్ సందర్భంగా ఆ జట్టు రెండు
జట్లను ప్రతిపాదించింది. ముందు బౌలింగ్ ఉంటే ఓ జట్టును, బ్యాటింగ్ అయితే మరో
జట్టుతో సిద్ధమైంది. అంటే ఈ కొత్త నిబంధన ఆయా జట్లపై టాస్ ప్రభావాన్ని చాలా
వరకూ తగ్గిస్తుంది.
ఇక ఈసారి ఐపీఎల్ 2023లో మరో మార్పు డీఆర్ఎస్. అంపైర్లు ఇచ్చే నో బాల్స్, వైడ్
బాల్స్ కూడా డీఆర్ఎస్ పరిధిలో రానున్నాయి. అంటే ఫీల్డ్ అంపైర్ ఇచ్చే నో బాల్
లేదా వైడ్ బాల్ని సైతం జట్టు కెప్టెన్ రివ్యూ చేసే అవకాశముంది. ఫలితంగా నో
బాల్, వైడ్ బాల్ వివాదాలు తగ్గవచ్చు.