లైనప్‌లో కొన్ని మార్పులు చేయాలని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్
అభిప్రాయపడ్డాడు. అహ్మదాబాద్ టెస్టులో గెలిస్తే భారత జట్టు కూడా డబ్ల్యూటీసీ
ఫైనల్ చేరుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచుల్లో ఘోరంగా
ఓడిన ఆస్ట్రేలియా జట్టు.. మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకొని విజయం సాధించిన
సంగతి తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్
అర్హత సాధించింది. దీంతో రెండో బెర్తు కోసం భారత్ పోటీ పడుతోంది.అహ్మదాబాద్‌లో కనుక భారత్ గెలిస్తే ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగే
డబ్ల్యూటీసీ ఫైనల్లో మళ్లీ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడతాయి. దీన్ని
టీమిండియా దృష్టిలో ఉంచుకొని, తమ బలమైన జట్టుతో నాలుగో టెస్టులో బరిలో దిగాలని
పాంటింగ్ సూచించాడు. జట్టులో సరైన మార్పులు చేయకుండా ఈ మ్యాచ్‌లో ఆడితే,
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం భారత్ వృధా చేసుకుంటుందని చెప్పాడు. టెస్టు
ఛాంపియన్షిప్ ఫైనల్ అనేది ఒకే టెస్టు మ్యాచ్ అని, ఆ తర్వాత మరో అవకాశం
దక్కదని గుర్తుచేశాడు. కాబట్టి సరైన జట్టును ఎంపిక చేయడం చాలా ముఖ్యమని
చెప్పాడు.
ఇంగ్లండ్‌లోని పరిస్థితుల్లో సక్సెస్ అయ్యే జట్టును భారత్ ఎంపిక చేయాలని సలహా
ఇచ్చాడీ ఆసీస్ లెజెండ్. సూర్యుడు ఉన్నంత వరకు ఓవల్‌లో బ్యాటింగ్ చాలా
బాగుంటుందని, యూకేలోని మిగతా వికెట్లతో పోలిస్తే ఓవల్ చాలా బెస్ట్ అని
చెప్పాడు. ‘కాబట్టి అక్కడి పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొనే వాళ్లు కావాలి.
దాని కన్నా ముందు ఆడుతున్న ఈ చివరి సిరీస్‌ను మర్చిపోతే మంచిది.ఎందుకంటే
భారత్‌లో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులు చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి’ అని
తేల్చేశాడు. అలాగే అహ్మదాబాద్ టెస్టులో ఆసీస్ అయినా, భారత్ అయినా సరే.. రెండు
జట్లు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకొనే జట్టును ఎంపిక చేస్తాయని
అభిప్రాయపడ్డాడు.