దూరమయ్యేలా ఉన్నాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో తీవ్రంగా బాధ పడుతున్న అతన్ని
భారత జట్టులో నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ నాటికి
అతను తిరిగి టీమిండియాకు అందుబాటులోకి వస్తాడని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీసులో అతన్ని ఆడించారు.ఆసీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన అతను..
ఆ తర్వాత తన గాయం తిరగబెట్టడంతో మరోసారి ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఆసియా
కప్‌తోపాటు టీ20 వరల్డ్ కప్ కడా బుమ్రా ఆడలేదు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్
అకాడమీలో చికిత్స తీసుకుంటూ ఉన్న అతన్ని తాజాగా న్యూజిల్యాండ్‌కు తరలించినట్లు
సమాచారం. ఈ వివరాల ప్రకారం చూసుకుంటే.. ప్రస్తుతం బుమ్రా న్యూజిలాండ్‌లో
ఉన్నాడు.
బుమ్రా గాయం నుంచి కోలుకోవడానికి చాలా కాలం పాడుతుందని వైద్యులు చెప్తున్నారు.
ఆపరేషన్ తర్వాత బుమ్రా అదే ఆస్పత్రిలో కొంత కాలం గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో
శస్త్రచికిత్స తర్వాత నేరుగా అతను జట్టులోకి రావడం కూడా అసాధ్యంలా
కనిపిస్తోంది దానికితోడు అతను పూర్తిగా కోలుకొని మళ్లీ బౌలింగ్ చేయాలంటే
బుమ్రాకు కనీసం ఆరు నెలల విశ్రాంతి అసవరం అని తెలుస్తోంది. ఈ విశ్రాంతి తర్వాత
మళ్లీ నెమ్మదిగా తన పూర్వపు ఫామ్ కోసం ప్రయత్నించడం బుమ్రా ముందున్న సవాల్.
ఇదే జరిగి బుమ్రా మళ్లీ క్రీడా మైదానంలో దిగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ లెక్కన
మరికొన్ని రోజుల్లో జరిగే ఐపీఎల్ 16వ సీజన్లో బుమ్రా ఆడటం ఇక కల్లే.
దానికితోడు ఈసారి భారత్ కనుక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్‌లో కూడా
బుమ్రా ఆడటం కష్టమే. దానికితోడు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో
జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా బుమ్రా ఆడటం అనుమానంగా తోస్తోంది.