సౌరవ్ గంగూలీ.. ఈ పేరు తెలియని టీమిండియా అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు.
టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్లేయర్లలో ‘దాదా’కు ఓ
ప్రత్యేక స్థానం ఉంది. టీమిండియా కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో విజయాలను అందించిన
గంగూలీ, మైదానం బయట కూడా అభిమానులకు దగ్గరగానే ఉన్నాడు. అటు ఐపీఎల్ మాజీ
ప్లేయర్‌గా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్
డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. అవును
బంగారు స్మగ్లర్‌గా అవతారమెత్తిన గంగూలీ ప్రస్తుతం నెటిజన్ల అభినందనలను
అందుకుంటున్నాడు. ఇంకా గంగూలీ ఆ గ్యాంగ్‌స్టర్ పాత్రలో సరిపోయాడు. ‘రిచ్ మారీ’
బిస్కెట్స్ యాడ్‌లో గంగూలీ ఒక గోల్డ్ స్మగ్లర్. ‘మోనా బంగారం ఎక్కడ ఉంది..?’
అంటూ వచ్చి.. ‘గోల్డ్ కాయిన్ గెలవాలంటే ఈ బిస్కెట్లు కొనండి..’ అని యాడ్
ముగిస్తాడు గంగూలీ.అయితే దీనికి సంబంధించిన యాడ్ వీడియోను గంగూలీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా
ద్వారా షేర్ చేశాడు. దీంతో ఈ యాడ్ కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియోను చూసిన నెటిజన్లు ‘దాదా’ను తమ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ
వీడియోకు ఇప్పటి వరకు 6 లక్షల 6 వేల వీక్షణలు, 59 వేల లైకులు వచ్చాయి. అలాగే
నెటిజన్లు కూడా వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.