ఏప్రిల్ 23న టెండూల్కర్ బర్త్డే..
వాంఖడేలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
క్రికెట్ నుంచి రిటైర్ అయిన దశాబ్దం తర్వాత సచిన్ టెండూల్కర్ కు ఓ అరుదైన
గుర్తింపు దక్కనుంది. తన చివరి మ్యాచ్ ఆడిన ముంబైలోని ఐకానిక్ వాంఖడే
స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టెండూల్కర్ ఏప్రిల్ 23న
50వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోనున్నారు. ఈ సందర్బంగా సచిన్
విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని క్రికెట్ అధికారులు భావిస్తున్నారు. “ఇది వాంఖడే
స్టేడియంలో మొదటి విగ్రహం.దానిని ఎక్కడ ఉంచాలో మేము నిర్ణయిస్తాము” అని ముంబై
క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్ కాలే చెప్పారు. భారతరత్న సచిన్
టెండుల్కర్ కు 50 ఏళ్లు నిండినందున ముంబై క్రికెట్ అసోసొయేషన్ నుంచి అరుదైన
గుర్తింపు ఇవ్వాలని అనుకున్నట్లు అమోల్ వెల్లడించారు.