ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్
క్రికెట్ ప్రపంచం ఎందరో స్టార్ క్రికెటర్లను చూసింది. కానీ అందరిలోనూ విరాట్
కోహ్లీ కాస్త ప్రత్యేకం. ఎందుకంటే ఎలాంటి బ్యాట్స్‌మెన్ అయినా ఇంత నిలకడగా
పరుగులు చేయొచ్చా? అని క్రికెట్ వరల్డ్ ఆశ్చర్యపోయేలా చేశాడు. 2022 ఆసియా కప్
నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ మంచి స్కోరు చేస్తున్నాడు.
అయితే రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ సాధించలేకపో యాడు. అతను తన
చివరి 13వ టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ప్రస్తుతం
జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని స్కోర్లు – 44, 20, 12. మాజీ భారత
క్రికెట్ జట్టు కెప్టెన్ చివరి టెస్ట్ సెంచరీ 2019 నవంబర్ లో బంగ్లాదేశ్‌పై
చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సెంచరీ చేసిన తర్వాత మళ్లీ సెంచరీ మార్కు
అందుకోలేకపోయాడు. కరోనా కారణంగా 2020 సీజన్లో పెద్దగా క్రికెట్ జరగకపోవడం,
తండ్రి కావడంతో ఆస్ట్రేలియా టూర్ లో ఒకే టెస్టు ఆడడంతో 71వ శతకాన్ని
అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు.
ఒక ట్వీట్లో ఈ అంశాన్ని ఐస్లాండ్ క్రికెట్ ఇటీవల హైలైట్ చేసింది. “ఈ
గణాంకం మన భారతీయ అభిమానుల్లో చాలా మందికి నచ్చదు, కానీ విరాట్ కోహ్లీ సెంచరీ
చేసి చాలా కాలమైంది. 23 టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన కోహ్లీ 2019 తర్వాత వాటికి
దూరంగా వున్నాడు. ఇప్పుడు సమయం తిరిగి వచ్చింది. సెంచరీకి ఇంకా ఎంత సమయం
ఉంది?” అని ఐస్లాండ్ క్రికెట్ తన ట్వీట్లో రాసింది.