నావన్నీ ఊహాశక్తితో కూడి ఉంటాయి
చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ
తన సినిమాలు చాలావరకు తన దృక్కోణం, ఊహాశక్తితో కూడి ఉంటాయని చిత్రనిర్మాత
సంజయ్ లీలా బన్సాలీ చెప్పారు. పద్మావత్, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి
కతియావాడి వంటి చారిత్రక సంఘటనల నుంచి ప్రేరణ పొందిన చిత్రాలకు ఆయన దర్శకత్వం
వహించారు. ఇటీవలి కాలంలో తాను పీరియాడికల్ డ్రామాలను రూపొందించడం గురించి,
దేశంలో ఒక చారిత్రాత్మకంగా పని చేస్తున్నప్పుడు తాను చేసిన పరిశోధనల గురించి
కూడా మాట్లాడారు.
మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్
సెగల్, సంజీదా షేక్‌లు నటించిన తమ రాబోయే వెబ్-సిరీస్ హీరామాండి టీజర్‌ను
ముంబైలో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరందోస్తో కలిసి ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన
పలు ఆసక్తికర విషయాలను విలేకరులతో పంచుకున్నారు. మన దేశంలో హిస్టారికల్పై పని
చేస్తున్నప్పుడు, ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు. కాబట్టి
వాస్తవాలను సరిగ్గా తెలుసుకుని సినిమాలు తీయాలన్నారు.