ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. మంగళవారం
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే
అత్యధిక స్కోర్ చేసింది. ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ లో అత్యధిక స్కోర్ చేసిన
జట్టుగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరంభంలో వికెట్లు
కోల్పోయినా .. డాని వ్యాట్(59), నాట్ స్కీవర్ బ్రంట్(81) విరుచుకుపడటంత 20
ఓవర్లలో 213/5 భారీ స్కోర్ చేసింది. గతంలో థాయిలాండ్‌పై సౌతాఫ్రికా 195
రన్స్ చేసింది. ఇపుడు దాన్ని ఇంగ్లాండ్ అధిగమించింది. ఇక ఈరోజు జరిగిన
మ్యాచ్ విషయానికి వస్తే.. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన
పాక్.. 99/9 పరుగులకే పరిమితమైంది. సిద్రా అమీన్ 12 పరుగులు మినహా
మిగతా బ్యాటర్లు లో స్కోర్‌కే పరిమితమయ్యారు. దాంతో ఇంగ్లాండ్
114పరుగుల తేడాతో గెలిచింది.