ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. వరల్డ్ నెంబర్
వన్ టీమ్‌గా ఉన్న ఆసీస్‌ను వరుసగా రెండు టెస్టు మ్యాచు ల్లో చిత్తుచేసింది.
రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రవీంద్ర జడేజా 10 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్
ఆరు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ రెండో
ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలగా.. 115 పరుగుల లక్ష్యాన్ని భారత్
నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా
బ్యాటింగ్ చేసే క్రమంలో రెండో పరుగు కోసం యత్నించి.. రన్ ఔట్ అయ్యాడు. తన
వికెట్‌ను వందో టెస్ట్ ఆడుతున్న పుజారా కోసం త్యాగం చేశాడు. ఇందుకు సంబంధించిన
వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కేఎల్ రాహుల్ ఒక పరుగు చేసి ఔట్ అవ్వగా.. పిచ్ స్పిన్నర్లకు సహరిస్తోంది.
దీంతో దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాలని
హిట్‌మ్యాన్ భావించాడు. లంచ్ తరువాత రెండో సెషన్ ఆట ప్రారంభమైన వెంటనే.. 2
ఫోర్లు, 2 సిక్సర్లు బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. కేవలం 20 బంతుల్లోనే
31 పరుగులు చేశాడు. అయితే కుహ్నెమాన్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడిన రోహిత్ ఒక
పరుగు తీశాడు. రెండో పరుగు కోసం యత్నించగా.. ఫీల్డర్ కీపర్‌కు విసిరాడు.
అప్పటికే పుజారా క్రీజ్ వదిలి నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు పరిగెత్తాడు. గమనించిన
రోహిత్ శర్మ వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నా వెళ్లలేదు. పుజారా కోసం తన వికెట్
త్యాగం చేసి రనౌట్ రూపంలో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ రోహిత్ త్యాగాన్ని ప్రశంసిస్తూ
ట్విట్టర్లో ఇలా రాశాడు. “అదీ నాయకత్వం. కెప్టెన్ అంటే ఇలా ఉండాలి” అంటూ
ట్వీట్ చేశాడు.