భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్‌పై వివాదం రాజుకుంది. ఢిల్లీలోని అరుణ్
జైట్లీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్
కోహ్లీ 84 బంతుల్లో 4×4 సాయంతో 44 పరుగులు చేసి శనివారం ఔటయ్యాడు. ఇన్నింగ్స్
50వ ఓవర్ వేసిన స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బంతిని
డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి కోహ్లీ బ్యాట్, ప్యా డ్ని
ఒకేసారి తాకినట్లు కనిపించింది. దాంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం ఆస్ట్రేలియా టీమ్
అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వేలెత్తేశాడు. కానీ.. బంతి
బ్యాట్‌కి తాకిందని ధీమా వ్యక్తం చేసిన కోహ్లీ డీఆర్ఎస్ కోరాడు. రిప్లైలో
బంతి తొలుత బ్యాట్‌కి తాకి.. అనంతరం ప్యా డ్ని తాకుతున్నట్లు కనిపించింది.
బంతి ముందుగా బ్యాట్‌కి తగిలిందా లేక ప్యాడ్లకు తగిలిందా అనే అంశం
చర్చనీయాంశమైంది. మైదానంలోని అంపైర్ అతడిని ఔట్ చేయడంతో కోహ్లీ డీఆర్ఎస్ కోసం
వెళ్లాడు. తాకిన సమయంలో బ్యాట్, ప్యాడ్ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని
రీప్లేలు చూపించాయి. అల్ట్రా ఎడ్జ్ బంతి బ్యాట్‌కు దగ్గరగా ఉన్నప్పుడు కూడా
స్పైక్‌ను గుర్తించింది. బాల్ ట్రాకర్ అంపైర్ కాల్ని చూపించాడు – బాల్ లెగ్
స్టంప్‌ను క్లిప్పింగ్ చేస్తోంది. అయితే, రీప్లేలు ఆన్-ఫీల్డ్ అంపైర్
నిర్ణయాన్ని తారుమారు చేసేంత నిశ్చయాత్మకంగా లేవు. దీంతో, కోహ్లి భారత్‌ను
నిరాశపరిచి నిష్క్రమించాల్సి వచ్చింది.